కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన “మా ఇంటి బంగారం”(Maa Inti Bangaaram) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా.. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించగా, సమంత స్వయంగా నిర్మించడం ప్రత్యేకతగా నిలిచింది. కథ, భావోద్వేగాలతో కూడిన ఈ సినిమాలో సమంత నటన ప్రధాన హైలైట్‌గా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. “మా ఇంటి బంగారం” చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సమంత ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

