Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వానాకాలం సీజన్‌కు సంబంధించి మహబూబ్ నగర్ (Mahabubnagar)  జిల్లాలో రైతుల కోసం యూరియా బుకింగ్ యాప్‌ను (Urea Booking App) అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ గురువారం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రైతులు యూరియాను సులభంగా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న 250 అధీకృత ఎరువుల డీలర్ దుకాణాల్లో ఎక్కడైనా యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ.. 14,759 బ్యాగుల యూరియా నిల్వలున్నాయని.. జిల్లాలో యూరియా కొరత ఏ మాత్రం లేదని చెప్పారు.

మార్క్ ఫెడ్‌లో 5,868 మెట్రిక్ టన్నులు, కంపెనీ గోదాముల్లో 2,339 మెట్రిక్ టన్నులు, హోల్‌సేల్ డీలర్ల వద్ద 306 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 8,513 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని వెల్లడించారు. కౌలు, ROFR రైతులు కూడా ఈ యాప్ (Urea Booking App) ద్వారా యూరియా పొందవచ్చన్నారు. ఏడీఏ (టెక్నికల్) బి.మాధవి, వ్యవసాయ అధికారి (టెక్నికల్) ఎం.ఎ.బాసిత్, ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Read Also: ఈ రోజు రాత్రి ఇరాన్‌పై దాడి.. ట్రంప్ సంచలన ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>