Mobile Popup Ad
Mobile Popup Ad

హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు: కూనంనేని

కలం, హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) హెచ్చరించారు. హనుమకొండలోని గుండ్లసింగారం భూపోరాట కేంద్రంలో మంగళవారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ పేరుతో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అయినప్పటికీ నేటికి అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా పేదవాడి జీవితం మారలేదన్నారు. పేదలు సీపీఐ ఆధ్వర్యంలో అనేక చోట్ల భూపోరాటాలు నిర్వహించి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజాసమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. పాలకులు పేదల అనుకూల విధానాలను అవలంబించడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనవద్దంటూ పేదలకు నీతులు చెబుతూ పెద్దలకు అనుకూలంగా మెదులుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టుల మద్దతు ఉంటేనే ప్రభుత్వాలు మనగలుగుతాయని అన్నారు. కమ్యూనిస్టులు లేకుంటే తెలంగాణాకే విముక్తి జరిగేది కాదని అన్నారు. గుండ్ల సింగారంలో ఎంతో దీక్ష, పట్టుదలతో కాలనీ నిర్మించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని, కాలనీలో నివసిస్తున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలు వచ్చేలా తాను అధికారులు , స్థానిక ఎమ్మెల్యేతో అవసరం అయితే సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లాఖాద్రి, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, బత్తిని సదానందం, మునిగాల బిక్షపతి, మాలోత్ శంకర్, శనిగరపు రాజు కుమార్, కొట్టే వెంకటేష్, వేల్పుల సారంగపాణి, అనుకారి అశోక్, రాసమల్ల దినా, మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, గ్రామ పెద్దలు మాదాసి కళ్యాణ్, గాదె రాజన్న, కట్కూరి కృష్ణ, జన్ను కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>