కలం, ఖమ్మం బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ, మండల, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ దఫాలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమకావాల్సిన బిల్లుల విషయంలో ఎదురవుతున్న లోపాలను సరిచేయాలని సూచించారు. సాంకేతిక సమస్యల కారణంగా బిల్లులు నిలిచిపోకుండా స్థానిక అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
ఇండ్ల నిర్మాణ బిల్లుల విషయంలో పేద లబ్ధిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన (MLA Kunamneni) పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, కమిషనర్ సుజాత, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Also: కాళేశ్వరం ఎఫెక్ట్ : రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్
Follow Us On: Sharechat

