కలం, వలిగొండ: కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వలిగొండ గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) ఎలక్ట్రిక్ పారిశుద్ధ్య వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనం వినియోగం వలన గ్రామ పంచాయతీపై ఇంధన, నిర్వహణ వ్యయ భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ తోడ్పాటు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కుంభం వెంకట్ పాపిరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

