తండాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

కలం మెదక్ బ్యూరో: తండా వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, తండాల సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar Reddy) తెలిపారు. మెదక్ (Medak) జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలం కొత్త వాల్య తండాలో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తండా వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడం ఆయన బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ద్వారానే గ్రామాలు, తండాల రూపురేఖలు మారుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తండాల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని, గ్రామీణ ప్రాంతాల పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Prabhakar Reddy) తెలిపారు.

Read Also:  ‘నో స్టాక్’.. తెలంగాణలో డీజిల్ బాంబ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>