అమరావతికి 70 నిమిషాల్లోనే.. బుల్లెట్ ట్రైయిన్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కు బుల్లెట్ రైలు (Bullet Train) రాబోతుందని.. దీని ద్వారా హైదరాబాద్ నుంచి అమరావతికి (Amaravati) కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే ఈ బుల్లెట్ ట్రెయిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరు గంటలకు పైగా పడుతున్న రైలు ప్రయాణం బుల్లెట్ ట్రెయిన్ సర్వీసుతో గంట పది నిమిషాల్లోనే చేరుకునే వీలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఈ ట్రెయిన్ రోజుకు ఎన్ని ట్రిప్పులు నడుస్తుంది, వారానికి ఎన్ని సర్వీసులు ఉంటాయి.. వీటిని దక్షిణ మధ్య రైల్వే త్వరలో ప్రకటించనున్నది.

దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో బుల్లెట్ ట్రెయిన్ (Bullet Train) సర్వీసుల అనుసంధానం పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విధాన నిర్ణయం తీసుకున్నది. హై స్పీడ్ రైళ్ళపేరుతో హైదరాబాద్‌ను కలిపేలా మూడు సర్వీసులను కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ నుంచి అమరావతి, హైదరాబాద్ నుంచి పూణె, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రెయిన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి పూణెకు కేవలం 1.55 గంటల్లోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం రెండు గంటల 8 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

Read Also:  ‘నో స్టాక్’.. తెలంగాణలో డీజిల్ బాంబ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>