జంతర్ మంతర్ ఘటన: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల (Jantar Mantar protests)పై పోలీసుల అణిచివేత చర్యలను సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. జూలై 20వ తేదీన జరిగిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజాస్వామ్యంలో నిరసనలు సహజమని, శాంతియుతంగా తమ డిమాండ్లను వినిపిస్తున్న విద్యార్థుల ఆందోళనను అణిచివేసే ప్రయత్నం చేయడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపించేందుకు వీలుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఆందోళనకారులపై పోలీసులు విచక్షణారహితంగా బలప్రయోగానికి దిగడం, కనీస ప్రోటోకాల్ పాటించకపోవడంపై ధర్మాసనం మండిపడింది. విద్యార్థులపై పెల్లెట్ గన్లు, ఎలక్ట్రిక్ లాఠీలను ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసుల దాడి కారణంగా అనేకమంది యువకులు తీవ్రంగా గాయపడ్డారని, ఇందుకు కారణమైన వారిపై బాధ్యతను నిర్ధారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>