కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలోని చేగుంట, నార్సింగి మండలాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar Reddy) పర్యటించారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులను పరామర్శించారు. వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాల్లో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు.
Read Also: అజారుద్దీన్, కోదండరాంలకు లైన్ క్లియర్
Follow Us On : WhatsApp

