Mobile Popup Ad
Mobile Popup Ad

రూ.16.25 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కలం, చండూరు: చండూరు (Chandur) మున్సిపల్ పట్టణంలో రూ.16.25 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) గురువారం శంకుస్థాపన చేశారు. పట్టణంలో రూ.15 కోట్లతో సెంట్రల్ డివైడర్, చండూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో 1 కోటి 25 లక్షల వ్యయంతో మార్కెట్ కార్యాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణను కలియ తిరిగి భవనాన్ని నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించి, భవన నిర్మాణంపై అధికారులకు కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు.

ఇటీవల ఎన్నికైన మండల అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డికి, పట్టణ అధ్యక్షుడు ఐతిరాజు మల్లేశ్‌కు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి వెంకన్న, కమిషనర్ మల్లేశం, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మ వెంకన్న, కటకం రమేశ్, తెలుకుంట్ల రాజకుమారి, జిల్లా ధనమ్మ శ్రీనివాస్ సామ సుజాత యాదవ రెడ్డి, వాసు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>