‘కాక్రోచ్’ కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి మరో ఉద్యమం!

కలం, వెబ్ డెస్క్​ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు కాక్రోచ్​ జనతా పార్టీ (CJP) నడుం బిగించింది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. గ్రామీణ విద్యార్థులకు సైతం పట్టణ ప్రాంతాలతో సమానంగా మెరుగైన సౌకర్యాలు అందించడమే ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు.

మహారాష్ట్రలోని హింగోలి నుంచి శ్రీకారం

ఈ ఉద్యమాన్ని మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని తన స్వగ్రామం నుంచే అభిజీత్ దీప్కే ప్రారంభించనున్నారు. అక్కడ స్థానిక సర్పంచ్‌ను కలిసి బడుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. పౌరులు, తల్లిదండ్రులు, సర్పంచులు భాగస్వాములై ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బడిలో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం వంటి కనీస సౌకర్యాల స్థితిగతులను తల్లిదండ్రులు స్వయంగా తనిఖీ చేయాలని సూచించారు. వసతుల కొరత కనిపిస్తే ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక ఆడిట్‌లో నమోదు చేయాలని కోరారు. ఆ వివరాలను contact@cockroachjantaparty.org ఈమెయిల్ ఐడీకి పంపవచ్చని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>