ఊటూరులో ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి

కలం, మానకొండూర్: ఊటూరు–వేగురుపల్లి రోడ్డు సమస్యను అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) హామీ ఇచ్చారు. శుక్రవారం మానకొండూర్ మండలంలోని ఊటూరు (Utoor) గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో మాట్లాడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

ఈ క్రమంలో స్థానికులు ఊటూరు–వేగురుపల్లి రహదారి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ట్రాన్స్‌కోకు సంబంధించిన సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

మొర్రి శంకరయ్య కుటుంబానికి పరామర్శ

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొర్రి శంకరయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. ఊటూరు గ్రామ పర్యటనలో భాగంగా శంకరయ్య నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. శంకరయ్య మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెలిశెట్టి కళ్యాణి కిశోర్, ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు చంద్రమౌళి, స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగోని సునిల్, నాయకులు పల్లెర్ల లక్ష్మారెడ్డి, గుడాల మహేందర్, రామగిరి లక్ష్మణ్, వంతడ్పుల అనిల్, జెన్నయ్య, శ్రీనాథ్, మత్తయ్య, వెంకట్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>