జిరాక్స్ షాప్ ముసుగులో న‌కిలీ ఆధార్ కార్డులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: రంగారెడ్డి జిల్లాలో జిరాక్స్ షాప్ ముసుగులో న‌కిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులు (Fake Aadhaar and PAN Card) త‌యారు చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. జ‌ల్‌ప‌ల్లి (Jalpally) లో జ‌రుగుతున్న ఈ దందాను శుక్ర‌వారం పోలీసులు గుర్తించారు. న‌కిలీ కార్డులు సృష్టిస్తున్న‌ ఓ వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. జ‌ల్‌ప‌ల్లికి చెందిన సీహెచ్ మహ‌దేవ్ కొన్నేళ్లుగా స్థానికంగా ఓ జిరాక్స్ షాప్ నిర్వ‌హిస్తున్నాడు. అదే షాప్‌లో ఆధార్‌, పాన్ కార్డుల్లో మార్పులు కూడా చేస్తున్నాడు. క‌స్ట‌మ‌ర్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకొని ఆధార్ కార్డు, పాన్ కార్డుల్లో పుట్టిన తేదీలు, చిరునామాలు అక్ర‌మంగా మారుస్తున్నాడు.

త‌న జిరాక్స్ షాప్‌లో పుట్టిన తేదీల మార్పున‌కు రూ.300, పూర్తి వివ‌రాల మార్పున‌కు రూ.700 నుంచి రూ.1000 వ‌ర‌కు మ‌హ‌దేవ్‌ వ‌సూలు చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హ‌దేవ్ వ‌ద్ద న‌కిలీ కార్డులు త‌యారు చేపించుకున్న వాళ్లు వాటితో ఉద్యోగాలు, సిమ్ కార్డులు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు పొందిన‌ట్లు తెలిపారు. శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం మ‌హ‌దేవ్‌ను అరెస్ట్ చేసింది. అత‌డి విచార‌ణ అనంత‌రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ స్థాయిలో న‌కిలీ దందా జ‌రిగిందో తెలిసే అవ‌కాశం ఉంది.

Also Read : గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల వేట!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>