నవంబర్ 1న ఆదిలాబాద్‌కు కేటీఆర్.. జన సమీకరణపై అనిల్ జాదవ్ దృష్టి

కలం, నేరడిగొండ: రైతు సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా పార్టీ శ్రేణులను సమీకరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడంతోపాటు నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన (KTR Adilabad Visit) ను విజయవంతం చేసేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్యాచరణ చేపట్టారు.

ఈ క్రమంలో శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గ్రామగ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా గులాబీమయం కావాలని, సభకు భారీగా జనసమీకరణ చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>