Mobile Popup Ad
Mobile Popup Ad

పార్కులు ప్రజల ఆరోగ్యానికి చిరునామా: ఎమ్మెల్యే

కలం, మెదక్ బ్యూరో: పార్కులు ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్‌చెరు (Patancheru) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) అన్నారు. అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్ఎంటి శిల్ప లేఔట్ కాలనీ, పిఎన్ఆర్ కాలనీలలో ఒక కోటి 51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Gudem Mahipal Reddy) మాట్లాడుతూ… పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది జీహెచ్ఎంసీ డివిజన్లలో గల ప్రతి పార్కు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని, పార్కుల అభివృద్ధి ద్వారా ప్రజలకు ఆహ్లాద వాతావరణంలో పాటు పచ్చదనం పెరగడంతో పాటు కాలనీలలో స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలిపారు. ప్రతి పార్కులో పిల్లలకు ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>