రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు

కలం, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. అయితే దానికి పరిమిత సమయం కూడా ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించింది. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు చేసే ప్రదేశాలను ఒకరే రోజుల తరబడి ఆక్రమించుకుంటే రైతులు, కార్మికులు, ట్రేడ్ యూనియన్లు ఎక్కడికి వెళ్లి వాళ్ల హక్కుల కోసం నిరసన చేయాలని ప్రశ్నించారు. ఇది వారి నిరసన హక్కును హరించడమే కదా.. అని అభిప్రాయపడ్డారు. ఆందోళనలకు పిలుపునిచ్చేవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పోలీసులు అనుమతించినంత మాత్రాన అక్కడే తిష్ట వేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది.

అసలేం జరిగిందంటే..

ఢిల్లీలో ఇటీవల కాలంలో పలు పార్టీలు తరచూ ఆందోళనలు చేస్తుండటంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని పలు వ్యాపార సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వీరి తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. ‘ఇది పండగల సీజన్. రామ్ లీలా మైదానం, చుట్టు పక్కల ప్రాంతాల్లో చేపడుతున్న నిరసనలతో కిరాణా వ్యాపారులు, దినసరి కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. వాహనదారులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే రెండు నెలల పాటు ఆందోళనలు జరగకుండా నిషేధం విధించాలి’ అని కోరారు. స్పందించిన సీజేఐ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆందోళన నిర్వాహకులను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది.

Also Read : బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>