భారత్ సమ్మిట్‌లో క్షమాపణలు చెప్పిన రాహుల్ గాంధీ.. ఎందుకంటే?

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ ముగింపు కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమ్మిట్‌కు ఆహ్వానించిన కొంతమంది విదేశీ ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని ఆయన ఆరోపించారు. అలాంటి వారిని ఈ సదస్సుకు రప్పించలేకపోయినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని వ్యాఖ్యానించారు.

గత కొన్నేళ్లుగా దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్ట్ విధానాలపై విస్తృతంగా చర్చ జరుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను, భిన్నాభిప్రాయాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. వ్యవస్థలు కుప్పకూలినప్పుడు మాత్రమే ఫాసిస్టులు బయటకు వస్తారని చెప్పుకొచ్చారు. ఫాసిస్టులు కేవలం అరుస్తారని, ఎవరి మాట వినరని పేర్కొన్నారు.ప్రస్తుతం దేశంలో ఫాసిస్టుల ఆగడాలు మితిమీరిపోయాయని విమర్శలు గుప్పించారు.

మరోవైపు దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో 14 కోట్ల ఓట్లు చెల్లవని ఈసీ చెబుతుందని గుర్తు చేశారు. అయితే ఓట్లను తొలగించి జరిపితే ఎన్నిక అవుతుందా? ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో జరిగిందే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరిగిందని చెప్పారు. మోదీ, అదానీ దేశాన్ని అక్రమించారని ఆరోపించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు అన్ని అదానీకే వెళ్తున్నాయని తెలిపారు. గతంలో బిజినెస్ మెన్ గా ఉండే అదానీ బీజేపీ హయాంలో బిలినియర్ గా మారారని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>