కేసీఆర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు: కేటీఆర్‌

క‌లం, వెబ్‌డెస్క్: కేసీఆర్ (KCR) కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన భూ ఆరోపణలపై కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ పుట్టినప్పుడే వాళ్ల ఇల్లు రెండెకరాల్లో ఉండేదని, ఆయన తాతకు వందల ఎకరాలు ఉన్నప్పుడు కేసీఆర్‌కు 67 ఎకరాలు ఉండటంలో తప్పేముందని ప్రశ్నించారు. గురువారం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ త‌న‌ భూమి వివరాలన్నీ స్పష్టంగా ప్రకటించార‌ని తెలిపారు.

గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌ వెయ్యి ఎకరాలన్న సీఎం రేవంత్ ఇప్పుడు అసెంబ్లీలో 67 ఎకరాలు అని ప్ర‌క‌టించార‌ని, మిగతా 933 ఎకరాలు ఏమయ్యాయో చూపించాలని సవాల్ విసిరారు. ఆ భూమిని చూపిస్తే సీఎం పేరున రాస్తామని, లేదంటే రేవంత్ రెడ్డి బేషరతుగా కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తమను కావాలనే అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశారని, ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నిర్వహించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే తాము వచ్చి అసెంబ్లీలో కూర్చుంటామని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలన వెయ్యి రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని ఆరోపించారు. రేవంత్ కుటుంబ దందాలు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని కేటీఆర్ అన్నారు. రేవంత్ సీఎం అయ్యాక ఆయ‌న చిన్నాన్న ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఎలా వ‌చ్చిందో చెప్పాల‌న్నారు. ఆయన తమ్ముళ్ల ఏరోస్పేస్ కంపెనీల వెనుక అసలు నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ (KCR Farmhouse) వ‌ద్ద క‌బ్జా అయిన‌ భూమిని ద‌ళితుల‌కు పంచి పెడ‌తాన‌న్న సీఎం రేవంత్ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ స్పందించారు. ఎస్సీలపై సీఎం రేవంత్‌కు నిజంగానే ప్రేమ ఉంటే భట్టి విక్రమార్కను లేదా గడ్డం ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. 51 శాతం ఉన్న బీసీలను 46 శాతంగా చూపించారని మండిపడ్డారు. ధరణి వ్యవస్థను కబలించి దోపిడీ కోసం భూభారతిని తీసుకొచ్చారని విమర్శించారు. 22 ఏపై మంత్రులు, సీఎం వేర్వేరుగా పొంత‌న లేని మాట‌లు చెప్తున్నార‌ని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి కుటుంబం వట్టినాగులపల్లిలో భూములు దోచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత‌ల‌పై అసెంబ్లీలో ఇష్టారీతిన ఆరోప‌ణ‌లు చేశార‌ని కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. 22ఏ తొల‌గించే వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని వ‌దిలిపెట్టేది లేద‌న్నారు.

Also Read : ప్రజా పాలన దినోత్సవం.. సీఎం కీలక ప్రసంగం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>