ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరించాలి: ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రధాని మోదీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు త్రివర్ణ పతాకాలను తమ ఇంటిపై ఆవిష్కరించాలని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal ) కోరారు. ఇందూరులోని గాంధీ చౌక్ లో బుధవారం త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత స్వాతంత్రానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధాని మోడీ 2022లో హర్ ఘర్ తిరంగా ప్రారంభించారన్నారు. ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి ప్రజల్లో దేశభక్తి జాతీయ జెండాపై వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడం ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, ఎర్రం సుధీర్, బంటు రాము, బంటు ప్రీతి, శ్యామల, మల్కాయి మహేందర్, సునీత రాజు, బొబ్బిలి సువర్ణ వేణు, వైష్ణవి సుధా, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, జ్యోతి మురళి, మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>