Mobile Popup Ad
Mobile Popup Ad

అర్హులైన వికలాంగులకు వాహనాలు అందజేయండి: ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhan Pal Singh) డిమాండ్ చేశారు. మహిళా శిశు, వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల ప్రత్యేక వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాటరీ వాహనాలకు మోక్షం కలిగిందన్నారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ వాహనాలు అందేలా చొరవ తీసుకోవాలని కోరారు. తాను సైతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కలిసి లేఖను అందజేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం అనేక పథకాలను అందజేస్తుందన్నారు. ప్రత్యేక పరికరాలతోపాటు రెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి పద్మ, ప్రాజెక్ట్ అధికారి సౌందర్య, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, న్యాలం సునీత రాజు, మురళి జ్యోతి, శశాంక్, నాయకులు పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>