కలం, వెబ్ డెస్క్: కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ ప్రకాష్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. లేబర్ సెల్ నాయకుల సమక్షంలో ఆయన జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి కార్మికుల కృషి కీలకమని అన్నారు. వారి సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కార్మికులకు “శ్రమ శక్తి అవార్డులు” అందజేశారు. ఈ అవార్డులు అందుకున్న కార్మికులను నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: ORR వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
Follow Us On: X(Twitter)

