రఘునాథ చెరువు అభివృద్ధిపై ఎమ్మెల్యే ఫోకస్.. కీలక ఆదేశాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరులోని రఘునాథ చెరువు(Raghunath Cheruvu) మినీ ట్యాంక్ బండ్ నిర్వహణను కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మినీ ట్యాంకు బండ్‌‌పై మరమ్మతులు చేయించి, వాటి నిర్వహణను కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని తెలిపారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్‌పై సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. వీలైనంత తొందరగా అప్పగించాలని ఆదేశించారు.

అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ప్రధానంగా బోధన్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి, పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద వెజ్, నాన్ వెజ్ మార్కెట్, అమ్మ వెంచర్ సమీపంలో బ్రిడ్జ్ ప్రతిపాదనలు, తదితర అంశాలపై చర్చించారు. నగరంలోని రోడ్లపై ప్యాచ్ వర్క్, రూ.5 కోట్ల స్పెషల్ ఫండ్ స్టేటస్‌ను అడిగి తెలుసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>