సిపిఆర్ఓ మధుసూదన్‌కు మంత్రి కోమటి రెడ్డి నివాళులు

కలం, మిర్యాలగూడ : డిప్యూటీ సీఎం సిపిఆర్ఓ మధుసూదన్ (CPRO Madhusudan) మృతి పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy)  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం మధుసూదన్ నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. మధుసూదన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మంత్రి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5 లక్షల రూపాయలను కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా దశాబ్దకాలం సేవలందించిన మధుసూదన్ తనకు ఎంతో సన్నిహితుడని తెలిపారు. ఇటీవల డిప్యూటీ సీఎం వద్ద జరిగిన ఆర్ అండ్ బి శాఖ సమీక్ష సమావేశంలో రోడ్ నెట్‌వర్క్ ప్రెస్ నోట్ విషయంలో ఆయనతో సుదీర్ఘంగా చర్చించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయని, చిన్న వయసులోనే ఆయన హఠాన్మరణం చెందడం తీరని లోటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Read Also: SIRపై దృష్టి సారించాలి.. HYD పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>