గీత కార్మికుల ఉపాధికి గండి.. అధికారులపై ఆగ్రహం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) పట్టణంలో నిర్వహిస్తున్న గీతా పారిశ్రామిక సంఘంలో నిజమైన గీత కార్మికులకు (Toddy Tappers) సభ్యత్వం కల్పించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గీతా పారిశ్రామిక సంఘంలో నిజమైన గీత కార్మికులకు సభ్యత్వం కల్పించకుండా వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, బడా కాంట్రాక్టర్లకు సభ్యత్వాలు ఇస్తూ నిజమైన కార్మికుల ఉపాధికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత ఎక్సైజ్ అధికారులకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మల్ పట్టణంలో నిబంధనల ప్రకారం 11 విక్రయ కేంద్రాలు ఉండాల్సి ఉండగా, సుమారు 20 ప్రాంతాల్లో తెల్లగల్లు విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సంఘంలో సభ్యత్వం పొందినట్లు తమ వద్ద వివరాలు ఉన్నాయని, ఆ పేర్లను కూడా వెల్లడించారు. అక్రమాలపై ప్రశ్నించే గీత కార్మికులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు గీతా పారిశ్రామిక సంఘం వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన నిజమైన గీత కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>