డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రంతో రైతులకు మేలు: ఎమ్మెల్యే బండ్ల

కలం, జోగులాంబ గద్వాల: రైతాంగానికి అవసరమైన అన్ని రకాల సేవలు, సదుపాయాలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సేవా కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Bandla Krishna Mohan Reddy) అన్నారు. ఆదివారం కేటిదొడ్డి మండలంలోని వెంకటాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

రైతులు సాగుకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ అందుబాటులో ఉండే హాకా రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు, నిర్వాహకుడు వెంకటపురం గోపి, తదితరులు పాల్గొన్నారు.

Read Also: కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి: కొండా సురేఖ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>