epaper
Sunday, March 1, 2026
epaper

డిప్యూటీ సీఎం పవన్ కు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఛాలెంజ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు ఉమ్మడి మహబూబ్ నగర్, జడ్చర్ల ఎమ్మెల్యే జనుపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని ఛాలెంజ్ చేశారు. ఒంటరిగా పోటీచేసి తన దమ్ము ఏమిటో పవన్ చూపించాలని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మరో 70 ఏళ్లు అయినా పవన్ సీఎం కాలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అనిరుధ్ రెడ్డి. ‘‘పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి’’ అని అన్నారు అనిరుధ్ రెడ్డి.

తెలంగాణ వాళ్ళ నర దిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే ఇప్పుడు ఈ వివాదానికి ప్రధాన కారణం అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూనే అనిరుధ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం.. ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో’ అని అన్నారు. నిజంగా తెలంగాణ వాళ్ళకి నర దిష్టి, ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్రా వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారు.. కాబట్టి క్షమాపణలు చెప్పాలి అని అనిరుధ్(MLA Anirudh Reddy) డిమాండ్ చేశారు.

Read Also: కల్తీ నెయ్యి కేసు.. మరో 11 మందిని యాడ్ చేసిన సిట్‌

Follow Us On : X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!