కలం, తాంసి: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. తాంసి మండలం పాలోది గ్రామానికి చెందిన ఆడెపు నర్సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని అనీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు శనివారం ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను తన క్యాంపు కార్యాలయంలో అందజేస్తే, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్ పాల్గొన్నారు.

