కలం, నిర్మల్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda)ను బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. భేటీలో తెలంగాణలో పార్టీ బలోపేతం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా వారు అభిప్రాయాలు పంచుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

