గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే ఏలేటి

కలం, సారంగాపూర్ : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti)  అన్నారు. సారంగాపూర్ మండలం కంకెట గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనం, వీఓ భవనం, వీఓ షెడ్లతో పాటు ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మలక్ చించోలి గ్రామంలో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా గోదాం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన భవనాలు మహిళా సంఘాల కార్యకలాపాలకు, అంగన్వాడీ చిన్నారుల సంక్షేమానికి ఉపయోగపడతాయన్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం విద్యార్థుల భద్రతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>