కలం, నిర్మల్: నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన కామన్ కమ్యూనిటీ షెడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యనగర్ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే స్థానిక హనుమాన్ ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంతో పాటు షటిల్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి దివ్యనగర్ను ఆదర్శ కాలనిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వినీష్ లక్ష్మి, కౌన్సిలర్లు గంజి రాజు, రావులవార్ విఠల్, కూన శశాంక్, బీజేపీ నాయకులు జుట్టు దినేష్, సాదం అరవింద్, రావుల రాంనాథ్, చందు, ఈశ్వర్, ఆనంద్, ప్రజోత్, జమాల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

