కలం, వెబ్ డెస్క్: బల్కంపేట (Balkampet) రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కనులపండువగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి కొండా సురేఖ, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి, కుమార్తె నైమిష రెడ్డి కూడా హాజరయ్యారు. వారికి మంత్రి కొండా సురేఖ స్వాగతం పలికి.. దగ్గరుండి పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది.
పూజారులు ఇచ్చిన దండలను..
పూజారులు ఇచ్చిన దండలను మంత్రి కొండా సురేఖ, సీఎం సతీమణి గీతారెడ్డి ఒకరి మెడలో మరొకరు వేసుకోవడం అక్కడున్నవారి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. మంత్రి సురేఖ.. మరికొందరి మెడలో కూడా స్వయంగా పూలదండలు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది.

