కలం, నిర్మల్: దిలావార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళా సంఘాల బలోపేతంతో పాటు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలపై మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

