వలిగొండలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు

కలం, వలిగొండ: భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలను, ప్రజా సంక్షేమానికి చేసిన కృషిని కొనియాడారు. ఇందిరాగాంధీ (Indira Gandhi) ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>