ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!

కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను (Delhi Internet Ban) అధికారులు నిలిపివేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోజ్ జనతా పార్టీ (CJP) జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా, ముందస్తు జాగ్రత్త చర్యగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు.

ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

సెంట్రల్ ఢిల్లీ(Delhi)లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా సాధారణ ప్రజలు, ఉద్యోగులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్యాబ్ బుకింగ్ యాప్‌లైన ఉబర్, ఓలాలతో పాటు బైక్ టాక్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ సేవలకు సైతం తీవ్ర అంతరాయం కలగడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శాంతిభద్రతలను కాపాడేందుకు సెంట్రల్ ఢిల్లీకి వచ్చే మార్గాల్లో పోలీసులు భారీగా బలగాలను మోహరించి తనిఖీలు చేపట్టారు. జంతర్ మంతర్ ప్రాంతానికి ఎవరూ చేరుకోకుండా చుట్టుపక్కల రహదారులను బారికేడ్లతో మూసివేశారు. ఆందోళనలు అదుపులోకి వచ్చి, పరిస్థితులు సద్దుమణిగే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read : మిజోరంలో విషాదం: ఐఐఎస్ అధికారులు మృతి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>