Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రొడ్యూసర్లకు 15 రూల్స్​ పెట్టిన నాగదుర్గ..!

క‌లం, వెబ్ డెస్క్: సుకుమార్ రైటింగ్స్‌, బ‌న్నీ వాస్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న స‌రికొత్త మూవీని నేడు గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. ఈడుపు కాగితం (Idupu Kayitham) అనే విభిన్న టైటిల్‌తో రూపొందుతున్న‌ ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ (Nagadurga) జంట‌గా న‌టిస్తున్నారు. యూట్యూబ్ ఫోక్ సాంగ్స్‌తో చాలా ఫేమ‌స్‌ నాగ‌దుర్గ‌కు సిల్వ‌ర్ స్క్రీన్‌పై తొలి మూవీ ఇదే కావ‌డం విశేషం.

ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌కు త‌మిళ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌క‌రాజ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సుకుమార్, దిల్‌రాజు, అల్లు అర‌వింద్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సినిమాకు వంశీ రెడ్డి దొండ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో న‌టించే ఇత‌ర న‌టీన‌టుల‌పై స‌స్పెన్స్ నెల‌కొంది.

ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల్లో నిర్మాత బ‌న్నీ వాసు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. నాగ‌దుర్గ‌కు ఇదే మొద‌టి సినిమా అని, ఆఫ‌ర్ ఇవ్వ‌గానే తొంద‌ర‌గానే ఒప్పుకొని సినిమా చేసేస్తుంద‌ని భావించాన‌న్నారు. అయితే నాగ‌దుర్గ సినిమా చేయ‌డానికి 15 రూల్స్ పెట్టింద‌న్నారు. తాను చెప్పి రూల్స్ విన్న‌ప్పుడు తాను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తున్న‌ట్లు గుర్తుకు వ‌చ్చింద‌ని బ‌న్నీ వాసు చెప్పుకొచ్చారు. ఇక ఇప్ప‌టికే నాగ‌దుర్గ యూట్యూబ్‌లో ఇర‌గ‌దీసింద‌ని, సిల్వ‌ర్ స్క్రీన్‌పైనా త‌ప్ప‌కుండా సూప‌ర్ స‌క్సెస్ అవుతుంద‌ని చెప్పారు. స్పెష‌ల్‌గా నాగ‌దుర్గ కోసం సినిమాలో ఓ డ్యాన్స్ బిట్ కూడా పెట్టిస్తున్నామ‌ని తెలిపారు.

ఇక సినిమా పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే టైటిల్ నుంచి మొద‌లుకొని ఫ‌స్ట్ లుక్ వ‌ర‌కు ప‌క్కా ప‌ల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో సాగే క‌థ‌గా తెలుస్తోంది. ఓ జంట మూటాముళ్లె స‌ర్దుకొని ఊరు విడిచి బైక్‌పై సిటీకి వెళ్లున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అలాగే ఈడుపు కాగితం అనే ప‌దానికి అర్థం విడుకుల ప‌త్రం. తెలంగాణ యాస‌లో ఉన్న టైటిల్ చూస్తుంటే క‌థ కూడా అదే నేప‌థ్యంలో సాగుతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా న‌టీన‌టులు, షూటింగ్ వివ‌రాలు కొద్ది రోజుల్లో వెల్ల‌డించ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>