కలం, ఖమ్మం: ఆగస్టు 26,27 తేదీలలో సింగరేణి సంస్థ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయనుందని సింగరేణి (Singareni) కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) అడిషనల్ జనరల్ సెక్రటరీ మిరియాల రంగయ్య (Miriyala Rangaiah) తెలిపారు. పోయిన నెల 17, 18 తేదీలలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని,. ప్రభుత్వ జోక్యంతో ఆరోగ్య వంతులను అన్ఫిట్ చేశారని చెప్పారు. కనీసం రేపు నిర్వహించబోయే మెడికల్ బోర్డులోనైనా నిజమైన బాధితులకు న్యాయం జరగాలన్నారు.
29/1/1981 వారసత్వ ఉద్యోగాల అగ్రిమెంట్ ప్రకారం 16 రకాల జబ్బులు ఉన్న కార్మికులను కచ్చితంగా అన్ ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యాధుల తీవ్రతను, అంగవైకల్యాలను పర్సంటేజీలుగా వర్గీకరించ రాదన్నారు. 24 నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులను కూడా అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

