epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీ క్రైమ్స్.. 8 నెలలు.. 101 హత్యలు, మైనర్ల వెనుక మర్మమిదే!

కలం, వెబ్ డెస్క్:  Delhi Crimes | దేశ రాజధాని ఢిల్లీలో తరుచుగా హత్యలు, దాడులు, చోరీలు జరుగుతున్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నా ఏదో ఒక చోట క్రైమ్ జరుగుతూనే ఉంది. జనాభా తక్కువ ఉన్నప్పటికీ ఢిల్లీ ఇప్పుడు దేశంలో మైనర్లు చేసే నేరాల్లో 5వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా వంటి జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలను వెనక్కి నెట్టిన ఢిల్లీలో మైనర్లు క్రమంగా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ వైపు మళ్లుతున్నారని జాతీయ నేర నమోదు బ్యూరో (NCRB – National Crime Records Bureau) విడుదల చేసిన డేటా తెలిపింది. ఢిల్లీలో గడిచిన 8 నెలల్లో 101 హత్యలు జరిగాయి. మేజర్ క్రైమ్స్‌లో మైనర్ల పాత్ర ఎక్కువ ఉన్నట్లు పోలీసులు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. పలు నేరాల్లో మైనర్లు పాలుపంచుకున్నట్లు తేలింది. ఈ నేరాల వెనుక గ్యాంగ్‌స్టర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో 13 మంది మైనర్లు వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. రోహిణీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలుడిపై లైంగిక దాడి, షాకర్‌పూర్, వజీర్‌బాద్‌లో రెండు హత్యలు, హజరత్ నిజాముద్దీన్ సమీపంలో ఒక క్యాబ్ డ్రైవర్ హత్య జరిగింది. ఈ ఘటనల్లో మైనర్ల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 101 హత్యలు, 92 లైంగిక దాడులు, 157 దోపిడీలు, 161 హత్యాయత్నాలు, 460 చోరీలు జరిగాయి. ఈ కేసుల్లో ప్రధానంగా మైనర్లే పట్టుబడ్డారు. హత్య కేసుల్లో ఇప్పటికే 190 కంటే టీనేజర్లను పోలీసులు పట్టుకున్నారు. అటెంప్ట్ మర్డర్ ఘటనల్లో 288 మంది, దోపిడి కేసుల్లో 268 మంది, లైంగిక వేధింపుల కేసుల్లో 101 మంది, ఇతర కేసుల్లో 220 మంది మైనర్ల మీద కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 575 మందిని చోరీ కేసుల్లో దొరికారు.

ఢిల్లీలో జరిగిన మేజర్ క్రైమ్స్ (Delhi Crimes) లో మైనర్లు పాలుపంచుకోవడం కలకలం రేపుతోంది. నేరాల గురించి అవగాహన లేకపోవడం, తరచుగా పాఠశాలలకు బంద్ కొట్టడం, పేదరిక సమస్యలు, ప్రతికూల ఆలోచనలు, చెడు స్నేహాలు, సోషల్ మీడియా ప్రభావం కారణంగా మైనర్లు నేరాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మైనర్లను ఉపయోగించే గ్యాంగ్‌లు డ్రగ్స్ ఇస్తూ నేరాలకు ఉసిగొల్పుతున్నారు. దేశ భవిష్యత్తు కీలకంగా వ్యహరించే యువత, మైనర్లు నేరాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేస్తోంది.

Read Also: నాకు గుంటూరు చదువు లేదు.. గూడుపుఠాణి తెలియదు: KTRకు రేవంత్ కౌంటర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>