Mobile Popup Ad
Mobile Popup Ad

పరీక్షా కేంద్రంలో షాకింగ్ ఘటన : మృతశిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని

కలం, వెబ్​ డెస్క్​ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha)లో షాకింగ్​ ఘటన వెలుగుచూసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న పదహారేళ్ల బాలిక, పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి వచ్చిన ఆ విద్యార్థిని, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ఇన్విజిలేటర్ అనుమతి తీసుకుని టాయ్‌లెట్‌కు వెళ్లింది. అయితే ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించారు.

ఆ సమయంలో బాలిక నీరసంగా నడుచుకుంటూ బయటకు రావడాన్ని గమనించిన సిబ్బంది, ఆమెను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వారు లోపలికి వెళ్లి చూడగా బాత్రూం బేసిన్‌లో ఒక మృత శిశువు పడి ఉంది. పరువు పోతుందనే భయంతో, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ శిశువును బేసిన్‌లో కుక్కినట్లు సదరు బాలిక వెల్లడించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, అధికారులు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.

Read Also: కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ వాయిదా: కొత్త తేదీలు ఇవే

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>