హోం మంత్రి ఇలాకాలో మైన‌ర్‌పై లైంగిక దాడి!

క‌లం, వెబ్ డెస్క్‌: హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Vangalapudi Anitha) నియోజ‌క‌వ‌ర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైన‌ర్ బాలిక‌ను ప్రేమ‌తో వేధించిన వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. అంత‌డితో ఆగ‌కుండా వీడియోలు చిత్రీక‌రించి బెదిరింపుల‌కు గురి చేస్తున్నాడు. వివ‌రాల్లోకి వెళ్తే… అనకాపల్లి జిల్లా పాయకరావుపేట (Payakaraopeta)కు చెందిన మైనర్ బాలికను సాయిచంద్ అనే యువ‌కుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్ర‌మంలో కొద్ది రోజుల క్రితం సాయిచంద్ స‌ద‌రు బాలిక‌ను లాడ్జ్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాలిక‌ అసభ్యక‌ర‌ వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ వేధింపులను భరించలేక బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దల్లి సాయిచంద్, అతడి తల్లిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also: మూసీ రూపురేఖలు మారతాయా? నేడే ప్రజెంటేషన్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>