కలం, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన సన్ రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ కావడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ‘ది హండ్రెడ్’ టోర్నీ కోసం పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed)ను కావ్య మారన్ నేతృత్వంలోని ఫ్రాంచైజీ సుమారు సుమారు రూ. 2.15 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే గతంలో అబ్రార్ అహ్మద్ భారత సైన్యాన్ని, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను (Abhinandan Varthaman) ఉద్దేశించి విమర్శలు చేస్తూ చేసిన పాత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ నిర్ణయంపై భారత నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పరిస్థితి సదరు ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతా (Sunrisers Leeds) సస్పెండ్ అయ్యే వరకు వెళ్లింది. అబ్రార్‌ను జట్టులోకి తీసుకోవడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం రాబోయే ఐపీఎల్ (IPL) సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశభక్తికి సంబంధించిన అంశం కావడంతో సోషల్ మీడియాలో ఈ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాకిస్థాన్ నుంచి సన్ రైజర్స్‌కు పూర్తి మద్దతు ఉంటుందని అక్కడి క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Read Also: ఐపీఎల్‌లో రిషభ్ పంత్‌పై తీవ్ర ఒత్తిడి: డుప్లెసిస్
Follow Us On: Facebook

