అనారోగ్య బాధితురాలికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ఏలేటి!

కలం, నిర్మల్: దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన గీతాంజలి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండంపల్లి సర్పంచ్ తక్కల రమణరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యం రెడ్డి, నాయకులు జమాల్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>