Mobile Popup Ad
Mobile Popup Ad

మూసీ రూపురేఖలు మారతాయా? నేడే ప్రజెంటేషన్!

కలం, వెబ్ డెస్క్ : మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు కార్యాచరణపై విస్తృతస్థాయి చర్చకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈరోజు నగరంలోని తాజ్ కృష్ణా హోటల్‌లో ‘మూసీ ఇన్వైట్స్’ (MUSI INVITES) కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ భేటీలో మూసీ ప్రాజెక్టు స్వరూపం, అమలు తీరు, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనుంది. ఈ కీలక సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మీడియా సంస్థల అధినేతలకు ఆహ్వానం పలికారు.

కేవలం రాజకీయ నేతలే కాకుండా, దాదాపు 500 మంది మేధావులు, వ్యాపార దిగ్గజాలతో ప్రభుత్వం ఈ సందర్భంగా భేటీ కానుంది. ప్రాజెక్టుపై విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు, నిపుణుల సలహాలు, సూచనలను నేరుగా స్వీకరించి, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. కాగా, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో ‘గాంధీ సరోవర్’ (Gandhi Sarovar) ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చింది. ఈ సమావేశం (MUSI INVITES) ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వర్గాల సందేహాలను నివృత్తి చేసి, స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Read Also: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించాలి : మంత్రి తుమ్మల

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>