కలం, ములుగు : ములుగు (Mulugu) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో నమ్మించి నిందితుడు మోసం చేశాడు. ఏటూరునాగారం టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న తరుణ్ ఈ ఘటనకు కారణమని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక ఆరోగ్య పరిస్థితి బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు తరుణ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ.. కేసీఆర్‌కు కొత్త చిక్కులు!
Follow Us On: Instagram

