Mobile Popup Ad
Mobile Popup Ad

మంచిర్యాల జిల్లాలో భూకంపం!

కలం, వెబ్ డెస్క్‌: తెలంగాణలోని మంచిర్యాల (Mancherial) జిల్లాలో భూకంపం (Earthquake) సంభవించిన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మాల‌జీ వెల్లడించింది. బుధ‌వారం రాత్రి 11:49 గంటలకు రిక్ట‌ర్‌ స్కేలుపై 3.9 తీవ్రత న‌మోదైన‌ట్లు తెలిపింది. భూకంప కేంద్రం సుమారు 10 కిలో మీటర్ల లోతులోనే ఉన్న‌ట్లు పేర్కొంది. భూకంపంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గురైనా ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు వెల్ల‌డించారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ప‌లు చోట్ల ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. ఇరు రాష్ట్రాల‌ సరిహద్దుల్లో గ‌త‌ ఐదేళ్లలో ఐదో సారి భూకంపం రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>