Mobile Popup Ad
Mobile Popup Ad

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం: భవనంలో చిక్కుకున్న సిబ్బంది !

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో గురువారం భారీ అగ్నిప్రమాదం (Jubilee Hills fire) సంభవించింది. స్థానిక మంగళ గౌరి షాపింగ్ మాల్​ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాద సమయంలో షోరూం లోపల సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో భవనం లోపల ఉన్న వారు బయటకు రావడానికి వీల్లేకుండా చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>