కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ (Mahabubabad)లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (Praja Palana Pragati Pranalika) కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ(Konda Surekha). ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా అధికారులు, కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలు, గ్రామాల అభివృద్ధి, సదుపాయాల నిర్మాణం, అవకతవకల నివారణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ జరిగింది. సంబంధిత అధికారుల నివేదికలను పరిశీలించి, తదుపరి చర్యలపై మంత్రి సూచనలు ఇచ్చారు. ఈ సమీక్ష కార్యక్రమం ద్వారా ప్రజాపాలనలో పారదర్శకత, సమగ్రత, ప్రగతి సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టడం లక్ష్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Also: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On: X(Twitter)

