గ్యాస్​ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఎల్​పీజీ గ్యాస్​ ఉత్పత్తిపై పడింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గృహ వినియోగానికి గ్యాస్(Domestic LPG)​ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించింది. ఎల్​పీజీ ఉత్పత్తి పెంచాలని, గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని రిఫైనరీలకూ ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫేన్​, బ్యూటేన్​ గ్యాస్​ను పెట్రో కెమికల్ ఉత్పత్తులకు కాకుండా, ఎక్కువగా ఎల్​పీజీకి వాడాలని చెప్పింది. ఈ గ్యాస్​ను ప్రభుత్వ రంగ మార్కెటింగ్​ కంపెనీలపైన ఐవోసీఎల్, బీపీసీఎల్​, హెచ్​పీసీఎల్​ కంపెనీలకే మాత్రమే విక్రయించాలని చెప్పింది. కమర్షియల్​, ఇండస్ట్రియల్​, పెట్రోకెమికల్​ రంగాలకు సరఫరాపై పరిమితులు విధించింది. అలాగే, వంటింటి వినియోగాలనికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్​ సిలిండర్లు అందుబాటులో ఉండాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో రేపటి నుంచి 19.5కిలోల కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్ల సరఫరా నిలిచిపోనుంది.

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్​లో బల్క్​ కమర్షియల్​ వినియోగానికి గ్యాస్​ సరఫరా నిలిపివేశారు. మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి. కమర్షియల్​ గ్యాస్​ సరఫరా నిలిపివేయనుండడంతో నగరాలు, టౌన్లలోని రెస్టారెంట్లు, హోటళ్లు ముందు జాగ్రత్తగా బుకింగ్స్​ పెంచాయి. తిరుపతిలో గ్యాస్​ బుకింగ్స్​ అనూహ్యంగా పెరిగాయి. కాగా, గత కొన్నేళ్లుగా దేశంతో ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, ఎల్పీజీ(Domestic LPG) అవసరాల్లో సుమారు 60 శాతం వరకు భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. దేశ ఆర్థిక వృద్ధితో పాటు వంటింటికి గ్యాస్ సిలిండర్ల వినియోగం పెరుగుతోంది.

Read Also: విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపలు

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>