కలం, మెదక్ బ్యూరో: విశ్వకర్మ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy) హామీ ఇచ్చారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. విశ్వకర్మల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విశ్వకర్మల కోసం ATC లలో కోర్సు ప్రారంభించేలా సిఫారసు చేస్తామన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకంలో విశ్వకర్మలకు అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. విశకర్మలు సైతం నూతన టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు. విశ్వకర్మల సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు.

