ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం.. మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ :  హైదరాబాద్ (Hyderabad) లోని ఎర్రమంజిల్ జలసౌధ(Jalasoudha)లో ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధ్యక్షత వహించగా, మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పాల్గొన్నారు.. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రాజెక్టులలో 90 శాతం పనులు తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు.  వాస్తవానికి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఆయన అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే వదిలేశారని విమర్శించారు.

మక్తల్–నారాయణపేట కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు 99 శాతం భూములకు నష్టపరిహారం అందించిన ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జూరాల ప్రాజెక్టులో సిల్ట్ తొలగించకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని, సిల్ట్ తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (Palamuru-Rangareddy Lift Irrigation Scheme) లో భాగంగా భూత్పూర్, సంగనబండ, పంప్ హౌస్‌లతో పాటు సర్జీపూర్ పంప్ హౌస్‌ను కూడా పూర్తి చేయాలని మంత్రి  కోరారు.

సర్జీపూర్ పంప్ హౌస్‌ను పూర్తి చేయడం వల్ల మక్తల్, నారాయణపేట ప్రాంతాలకు తక్కువ సమయంలో ఎక్కువ నీటిని సరఫరా చేయవచ్చని తెలిపారు. భూత్పూర్, సంగనబండ గ్రామాల ప్రజలు 6 వేల ఎకరాలకు పైగా భూమి ఇచ్చినా ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని మంత్రి పేర్కొన్నారు. అలాగే సంగనబండ పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించి కర్ణాటక రైతులు సుమారు 100 ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి తగిన నష్టపరిహారం ఇస్తే ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తవుతాయని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>