కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని అనకాపల్లి జిల్లో భారీ చోరీ జరిగింది. చోడవరం మండలం గోవాడలో ఉంటున్న సుజాత ఇంట్లో ఉన్న 65 తులాల బంగారాన్ని (Gold Theft) గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై ఆమె వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బంగారంతో (Gold Theft) పాటు కొంత నగదును కూడా ఎత్తుకెళ్లినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీకి గురైన బంగారం, డబ్బు కలిపి రూ.1.5 కోట్ల దాకా ఉంటుందని బాధితురాలు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు.

